telugu navyamedia
సినిమా వార్తలు

ఆన్ లైన్‌ టిక్కెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి..

ఏపీ ప్ర‌భుత్వం ప్రవేశపెట్టిన‌ ఆన్‌లైన్ టికెట్స్ ధ‌ర‌ల‌ పై మెగ‌స్టార్ చిరంజీవి స్పందించారు. చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టిక్కెట్ల‌ బిల్ ప్రవేశపెట్టడం కోసం హర్షించదగ్గ విషయన్నారు. సినిమా టిక్కెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు.

అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ టిక్కెట్ల ధరలు ఉండాలని చిరంజీవి అన్నారు. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు తీసుకుంటున్న‌ప్పుడు, టికెట్ ధరల్లో కూడా అదే వెసులుబాటు ఉండ‌డం స‌మంజ‌సమన్నారు. సినిమా టిక్కెట్ల ధరపై ద‌య‌చేసి ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటేనే సినీ పరిశ్రమ నిలదొక్కుకుంటుంది చిరంజీవి ట్వీట్ చేశారు.

కాగా…సినిమాటోగ్రఫీ సవరణ బిల్లుకు బుధవారం ఏపీ అసెంబ్లీ ఆమోద ముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఇక నుంచి రోజుకి నాలుగు ఆటలు మాత్రమే నడపాలని.. పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేకుండా.. అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటును నిర్ణయించింది.

గతంలో పెద్ద హీరో సినిమాలకు 200 నుంచి 500 రూపాయలకు పైగా అమ్మిన పరిస్థితి ఉందని.. ఇప్పుడు అలాంటి పద్దతులు కుదరవన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటుకు సినిమా చూసేలా మధ్యతరగతి వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చినట్లు తెలిపారు.

Related posts