telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నేను అప్పుడు రాసిన కధే ఈ కరోనా… వర్మ ట్వీట్

varma not ready to leave tdp and tarak

కరోనా పరిస్థితులను తాను ముందే ఊహించానని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెల్లడించారు. రెండు సంవత్సరాల క్రితం తాను అధికారికంగా ప్రకటించిన ఓ సినిమా కథను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. 2018లో వైరస్‌ అనే సినిమాను తాను చేయబోతున్నట్లు వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై అధికారిక ప్రకటనతో పాటు సినిమా కథను కూడా ఆయన తెలిపారు. వైరస్‌ మూవీ కథ ప్రకారం ఆఫ్రికాకు వెళ్లిన ఓ యువకుడు ఓ వైరస్‌తో ముంబయికి వచ్చి ఇక్కడ ఆ వైరస్‌ను విస్తరింపజేస్తాడు. దాని తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో మనిషి, మనిషికి 20 అడుగుల దూరం మెయిన్‌టెన్ చేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తుంది. కానీ 2 కోట్ల జనాభా ఉన్న ముంబయిలో అది సాధ్యం కాదు. ఈ వైరస్‌ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య లక్ష దాటేయగా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో ముంబయికి అన్ని రకాల సంబంధాలను ప్రభుత్వం తెంచుకుంటుంది. ఇక వైరస్‌ తీవ్రత పెరుగుతూ ఉండగా ఎవరైతే ముంబయి నుంచి తప్పించుకోవాలనుకుంటారో వారిని కాల్చిపారేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది. ఈ క్రమంలో ముంబయివాసుల మధ్య జరిగే సంఘర్షణలను సినిమాగా తెరకెక్కిస్తున్నాను అని వర్మ అప్పట్లో వెల్లడించారు.

Related posts