telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో యంగ్ హీరోకు మెగాస్టార్ అండ

Chiranjeevi

యంగ్ హీరో నిఖిల్‌, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో టి.ఎన్. సంతోష్ తెర‌కెక్కించిన చిత్రం అర్జున్ సుర‌వరం. బి.మధు (ఠాగూర్ మధు) సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త‌మిళంలో సూప‌ర్ సక్సెస్ అందుకున్నక‌నిత‌న్‌కి రీమేక్‌గా అర్జున్ సుర‌వ‌రం చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ జ‌ర్నలిస్ట్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, తరుణ్ అరోరా, సత్య, నాగినీడు ముఖ్య పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. మార్చి లోనే విడుద‌ల కావ‌ల‌సి ఉన్న ఈ చిత్రం ప‌లు కార‌ణాల వ‌ల‌న వాయిదా ప‌డింది. ముద్ర అనే టైటిల్‌ని ముందుగా ఈ చిత్రానికి ఫిక్స్ చేశారు. కాని అదే పేరుతో జ‌గ‌ప‌తి బాబు చిత్రం విడుద‌ల కావ‌డంతో పేరు మార్చి అర్జున్ సుర‌వ‌రం పేరుతో చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు మేక‌ర్స్‌. మేడే సంద‌ర్భంగా మే 1న మూవీని రిలీజ్ చేద్దామ‌నుకున్న‌ప్ప‌టికి అది వీలు కాలేదు. అవెంజ‌ర్స్ చిత్ర రిలీజ్ కార‌ణంగా సినిమాని మ‌రోసారి వాయిదా వేశారు. ఎట్ట‌కేల‌కి న‌వంబ‌ర్ 29న చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా రాబోతున్నారట. ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించనుంది.

Related posts