దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయస్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నికల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్రమిది. అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ పాత్రలో, రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. రెండు నిజ పాత్రల కల్పిత కథాంశమే ఈ చిత్రమని ఇది వరకే రాజమౌళి తెలియజేశారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ టైటిల్‌ను ఖరారు చేయబోతున్నారనే విషయం అందరిలో ఉత్సుకతను రేకెత్తిస్తున్నది. అయితే ఎన్టీఆర్ సరసన కథానాయికగా లండన్ భామ ఒలీవియాని ఫైనల్ చేశారు. ఇప్పటికే సినిమా 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రామ్‌చరణ్ జోడిగా బాలీవుడ్ తార ఆలియా భట్ నటిస్తున్నారు. లేటెస్ట్ సమాచారం మేరకు ఈ సినిమా పాటల చిత్రీకరణను రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట. అందులో భాగంగా ముందు రామ్‌చరణ్, ఆలియా భట్‌లపై ఓ రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీకరించాలనుకుంటున్నారట.
previous post
రాజశేఖర్ ను ఫ్రాడ్ అన్న జీవిత… అందరూ షాక్…!?