కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా..తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు. కరోనా లక్షణాలు కన్పించడంతో తాను పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు. ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందన్నారు. గత కొద్దిరోజులుగా కలిసిన వారు, సన్నిహితంగా ఉన్నవారు టెస్టులు చేయించుకోవాలని సూచించారు ఎమ్మెల్యే ఆల. కాగా.. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.7 లక్షలు దాటాయి కరోనా కేసులు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 517 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే ఇక 24 గంటల్లో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,73,858 కి చేరుకుంది.
ఆ సినిమా అద్భుతం.. ట్వీట్ చేసిన కేటీఆర్!