telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఫుట్ బాల్ ఆడుతున్న ఆవు… వీడియో వైరల్

Cow

ఓ ఆవు ఫుట్ బాల్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గోవాలోని మార్డోల్ ప్రాంతంలో దీన్ని చిత్రీకరించినట్టు తెలుస్తోంది. స్థానిక యువకులు ఫుట్ బాల్ ఆడుతుండగా బంతి ఆవు సమీపంలో పడింది. అంతే… అది బాల్ ను తన దగ్గరే ఉంచుకుని, ఎవరైనా బంతి కోసం దగ్గరికెళ్తే కస్సుమంది. అయితే ఓ యువకుడు ఎలాగో బంతిని లాక్కుని మరో వ్యక్తి వైపు విసిరాడు. అప్పటికీ ఆ ఆవు బంతి ఎటువైపు విసిరితే అటువైపు వెళ్తూ పరుగులు తీసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భారత ఫుట్ బాల్ జట్టులో దీన్నిచేర్చుకుంటే ఇక ఆట మనదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది ఫిఫాకు కూడా ట్యాగ్ చేస్తున్నారు. మీరు కూడా ఈ వీడియోను వీక్షించండి మరి.

Related posts