telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

పుల్వామా దాడి కారకులను శిక్షించాల్సిందే.. ప్రాన్స్ మంత్రి జీన్

france minister zean on pulwama attack

కాశ్మీర్ లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి ప్రపంచం మొత్తం ఖండించండి.. ఇంకా ఖండిస్తూనే ఉన్నాయి కూడా. భారత్ కూడా దీనిపై తక్షణ చర్యగా పాక్ లోని ఉగ్రవాద క్యాంపు పై దాడిచేసిన విషయం కూడా ప్రపంచ దేశాలు సానుకూలంగానే స్వాగతించడం విశేషం. అనంతరం పాక్ ప్రతీకార చర్య అంటూ భారత భూభాగంలోకి రావాలని ప్రయత్నించడం, దానిని భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ తన యుద్ధవిమానంతో తరిమి కొట్టడం లో భాగంగా అతడు పాక్ కు పట్టుబడటం జరిగింది. అతడిని పాక్ సురక్షితంగా భారత్‌కు అప్పగించడాన్ని ఫ్రాన్స్ స్వాగతించింది.

ఇరు దేశాలు తమ బాధ్యతను గుర్తించి సంయమనం పాటించాయని ప్రశంసించింది. ఈ మేరకు ఆ దేశ యూరప్-విదేశీ వ్యవహారాల మంత్రి జీన్-వైవెస్ లి డ్రియాన్ పేర్కొన్నారు. అభినందన్‌ విడుదలను స్వాగతిస్తున్నట్టు చెప్పిన జీన్.. ఇక మిగిలింది ఇరు దేశాల మధ్య చర్చలేనని, ఆ దిశగా ఇరు దేశాలను ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. ద్వైపాక్షిక చర్చల దిశగా రెండు దేశాల ప్రభుత్వాలను చర్చల దిశగా ప్రోత్సహిస్తాం, అని జీన్ పేర్కొన్నారు.

అంతేకాదు, పుల్వామా దాడికి కారకులైన వారికి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనని పేర్కొన్న మంత్రి అందుకోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

Related posts