telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-4లో బిత్తిరిసత్తి ?

Satthi

తనదైన మేనరిజంతో నవ్వులు పూయిస్తూ రాష్ట్రవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు బిత్తిరి సత్తి. త్వరలో బిత్తిరి సత్తి బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వనున్నాడని తెలుస్తుంది. తెలుగులో ‘బిగ్ బాస్’ షో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సీజన్-1ని నిర్వహించడంతో బిగ్ బాస్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తరవాత నాని, నాగార్జున మిగిలిన రెండు సీజన్ లకు హోస్ట్ లుగా వ్యవహరించారు. ఇక త్వరలో బిగ్ బాస్ సీజన్ 4 మొదలు కానుందని తెలుస్తుంది. లాక్ డౌన్ కారణం గా బిగ్ బాస్ 4 కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్ కు విజయ్ దేవరకొండ హోస్ట్ గా వ్యవహరిస్తారు అని టాక్ నడుస్తుంది. మరో వైపు వెంకటేష్ హోస్ట్ చేయబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సీజన్ లో బిత్తిరి సత్తి హౌస్ లో సందడి చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ చూడాలి.

Related posts