telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తల్లి వ్యాఖ్యలపై వివాదంలో చిన్మయి

Chinmayi

ప్రముఖ సింగర్ చిన్మయి మీటూ ఉద్యమం జరిగిన సమయంలో కోలీవుడ్ ప్రముఖ రచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికీ ఆమె వీలున్న ప్రతిసారి వైరముత్తుని చిన్మయి టార్గెట్ చేస్తూనే ఉంది. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెను టార్గెట్ చేశారు… చేస్తున్నారు కూడా. అయినప్పటికీ అమ్మాయిలపై ఎలాంటి అఘాయిత్యాలు జరిగినా వెంటనే స్పందిస్తుంది. కాగా ఇప్పుడు ఈ సింగర్ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆ వివాదానికి చిన్మయి తల్లి చేసిన వ్యాఖ్యలే కారణం కావడం గమనార్హం. వివరాల్లోకెళ్తే.. ఇటీవల ఓ టీవీ షోలో పాల్గొన్న చిన్మయి తల్లి మాట్లాడుతూ దేవదాసీ వ్యవస్థను కూల్చేసిన పెరియార్‌ని తాను ఎప్పటికీ క్షమించనని అన్నారు. దీంతో నెటిజన్లు చిన్మయి తల్లి మాట్లాడిన మాటలపై మండిపడ్డారు. కొందరైతే చిన్నయి ట్విట్టర్ అకౌంట్‌లో ట్యాగ్ చేస్తూ ప్రశ్నించడం ప్రారంభించారు. దీనిపై చిన్నయి స్పందించారు. తన తల్లి మాటలకు తాను బాధ్యత వహించనని, ఆమె వ్యాఖ్యలను వ్యతిరేకించాలని అనుకునేవారు వ్యతిరేకించవచ్చు. ఆమెకు మాట్లాడే హక్కు ఉందంటూ చిన్నయి సమాధానం ఇచ్చారు.

Related posts