telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

పెరుగుతున్న పెట్రో ధరలు.. ఢిల్లీలో లీటర్‌కు రూ.81

petrol bunk

చమురు కంపెనీలు పెట్రోల్‌ ధరలను వరుసగా పెంచుతున్నాయి. వరుసగా ఐదో రోజు పెరుగుదలను నమోదు చేశాయి. దేశంలో తాజాగా బుధవారం మరో పది పైసలు పెంచగా రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.81కి చేరింది. హైదరాబాద్‌లో లీటర్‌కు రూ.84.18, కొల్‌కతాలో రూ.82.53, ముంబైలో రూ.87.68, చెన్నైలో రూ.84.09, బెంగళూరులో రూ.83.63, భువనేశ్వర్‌లో రూ.81.54, జైపూర్‌లో రూ.88.21, పాట్నాలో 83.68, త్రివేండం రూ.82.66కి చేరింది.

గత ఐదు రోజుల్లో పెట్రోల్‌పై చమురు కంపెనీలు రూ.50పైసలకుపైగా పెంచాయి. కాగా, డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో లీటర్‌కు రూ.73.56 ఉండగా, హైదరాబాద్‌లో లీటర్‌కు రూ.80.17గా ఉంది. నిత్యం ధరలపై చమురు సంస్థలు సమీక్ష జరుపుతుండగా రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. వరుసగా చమురు కంపెనీలు ధరలు పెంచడంతో నిత్యావసర వస్తువులపై ప్రభావంపడే అవకాశముంది.

Related posts