telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అనసూయా పాత్ర పై మారుతి క్లారిటీ…

Anasuya

ఈ మధ్య వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ బిజీ అయిపోయారు అనసూయ. తెలుగు బుల్లితెర బ్యూటీగా పేరు తెచ్చుకొని అట్టు టీవీలో ఇట్టు సినిమాలో రాణిస్తుంది. అయితే ప్రస్తుతం సినిమాలో కొన్ని ప్రత్యేక పాత్రలు, పాటల్లో ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. గోపీచంద్ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమాలో కూడా అనసూయ ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఈ సినిమాలో అనసూయ పాత్రపై అనేక రూమర్లు సినీ సర్కిల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మారుతి, గోపీచంద్ కాంబోలో రానున్న సినిమాలో అనసూయా బోల్డ్ పాత్ర చేస్తుందని కొందరు, ఈ సినిమాలో అనసూయ వేశ్య పాత్ర చేస్తుందని మరి కొందరు అంటున్నారు. అయితే వీటిపై దర్శకుడు మారుతి స్పందించారు. అనసూయ చేస్తుంది అటువంటి పాత్ర కాదని, తన సినిమాలో అటువంటి పాత్ర లేదని క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాశీ ఖన్నా, ఈషా రెబ్బ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్2 బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది.

Related posts