telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అధ్యక్ష ఎన్నిక ముగించుకున్న .. శ్రీలంక .. సోమవారమే ఫలితాలు..

srilanka president poll completed result on

నేడు శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ చెదురు మదురు ఘటనలు మినహా అధికశాతం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో ప్రధానంగా మాజీ రక్షణ మంత్రి గొటబాయ రాజపక్స, అధికార పార్టీ తరపున సాజిత్‌ ప్రేమదాస, నేషనల్‌పీపుల్స్‌ పవర్‌ కూటమి తరపున కుమార దిసనాయకె మధ్య తీవ్ర పోటీ నెలకొంది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దేశవ్యాప్తంగా 1.59 కోట్ల మంది ఓటర్ల కోసం 12,845 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో పోలింగ్‌ స్టేషన్లతో పాటు 26 అంగుళాల అత్యంత పొడవైన బ్యాలెట్‌ పత్రాలతో ఈ ఎన్నికలు రికార్డులకెక్కాయి.

ఓటింగ్‌ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమైందని, అర్ధరాత్రి దాటిన తరువాత తొలి ఫలితాలువెలువడే అవకాశం వుందని అధికారులుచెప్పారు. సోమవారం నాటికి తుది ఫలితాలు వెలువడుతాయన్నారు. మన్నార్‌ ఈశాన్య ప్రాంతంలో ముస్లిం ఓటర్లను తీసుకు వస్తున్న బస్సులపై కొందరు గుర్తు తెలియని సాయుధులు దాడి చేశారని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఎలక్షన్‌ వయొలిఎన్స్‌ (సిఎంఇవి) ఒక ప్రకటనలో వివరించింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్లు సమాచారం అందలేదు. కొన్ని చోట్ల కొన్ని రాజకీయ పార్టీల మద్దతుదారులు ఓటర్లను అడ్డుకున్న ఘటనలు జరిగాయని సిఎంఇవి తన ప్రకటనలో వివరించింది. కొన్ని ప్రాంతాలలో ఓటర్లను అడ్డుకునేందుకు దుండగులు టైర్లకు నిప్పుపెట్టటం, బస్సులపై రాళ్లు రువ్వటం వంటి సంఘటనలకు పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. జాఫ్నాలో అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న అనుమానంపై పదిమందిని అరెస్ట్‌ చేశామని అధికారులు వివరించారు.

Related posts