నేడు నాలుగో దశ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 71 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 8 రాష్ట్రాల్లోని 71 నియోజకవర్గాల్లో మొత్తం 945 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలోని 41 శాసనసభ స్థానాలకు కూడా నేడే పోలింగ్ జరగనుంది. వాస్తవానికి ఇక్కడ 42 స్థానాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది.
పత్కుర నియోజకవర్గ బిజూ జనతాదళ్ అభ్యర్థి మరణించడంతో ఎన్నిక వాయిదా వేశారు. ఈ విడతలో ముంబైలోని వివిధ నియోజకవర్గాల నుంచి బాలీవుడ్ నటి, కాంగ్రెస్ నేత ఊర్మిళా మతోంద్కర్, సంజయ్ దత్ సోదరి ప్రియాదత్, పూనం మహాజన్, మిలింద్ దేవరాలతో పాటు సల్మాన్ ఖుర్షీద్, శతాబ్దీరాయ్, మూన్‌మూన్ సేన్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, సుభాష్ భామ్రే, ఎస్‌ఎస్ అహ్లువాలియా, బాబుల్ సుప్రియో తదితర ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.