telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎస్‌ఈసీ నియామకంలో ఎందుకింత జాప్యం: యనమల

Yanamala tdp

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకంలో ఎందుకింత జాప్యం చేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎస్ ఈసి నియామకంలో గవర్నర్ గారు ఎందుకింత తాత్సారం చేస్తున్నారని ప్రశించారు. ఫ్యూడలిస్ట్ పాలించే ఫెడరల్ స్టేట్‌గా ఏపీ బిల్లులు కేంద్రానికి పంపడంలో ఎందుకింత జాప్యమనిప్రశ్నించారు.

ఆర్టికల్ 243(కె) ఉల్లంఘన అక్షర సత్యమన్నారు. అధికారాల విభజన కేంద్ర రాష్ట్రాల మధ్య స్పష్టంగా జరిగిందన్నారు. బిల్లులపై ఆర్టికల్ 200, 201 ప్రకారం రాష్ట్రపతి ఆమోదం తీసుకోవాలన్నారు. ఏపీలో అధికార పరిధి అతిక్రమణ జరుగుతోందని యనమల పేర్కొన్నారు. -ఆంధ్రప్రదేశ్ లో అధికార పరిధి అతిక్రమణ జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్మణ రేఖను రాష్ట్రప్రభుత్వం అతిక్రమిస్తే కేంద్రమే జోక్యం చేసుకోవాలని అన్నారు.

Related posts