బీసీలపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిన చరిత్ర వైఎస్ కుటుంబానిదని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల ఆరోపించారు. అధికారం చేపట్టి 2 నెలలు కాకముందే ముగ్గురు బీసీలను హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను నిన్న బీసీ సమాఖ్య చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్యతో పాటు పలువురు బీసీ ప్రముఖులు కలిశారు. ఈ నేపథ్యంలో యనమల తీవ్రంగా స్పందించారు.
అమరావతిలో ఈరోజు మీడియాతో యనమల మాట్లాడుతూ బీసీలకు జగన్, వైఎస్ రాజశేఖరరెడ్డి అన్యాయం చేశారని విమర్శించారు. ఆదరణ-1 పథకాన్ని వైఎస్ రద్దు చేస్తే, ఇటీవల అధికారంలోకి వచ్చిన జగన్ ఆదరణ-2 పథకాన్ని రద్దుచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చింది టీడీపీయేనని స్పష్టం చేశారు. సొంత సామాజికవర్గాన్ని పైకి తెచ్చేందుకే జగన్ బీసీలను అణగదొక్కుతున్నారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తీరుతో రాష్ట్రం అభాసుపాలు: ఉత్తమ్