telugu navyamedia
ఆంధ్ర వార్తలు

సీఎం ఓ సైకో.. ఇంటికో సైకోను తయారు చేస్తున్నారు- జ‌గ‌న్‌పై మ‌రోసారి మండిప‌డ్డ చంద్ర‌బాబు

*సీఎం జ‌గ‌న్‌పై మ‌రోసారి మండిప‌డ్డ చంద్ర‌బాబు..
* ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా నడుచుకోకండి..వృత్తి ధర్మాన్ని పాటించండి
*వైసీపీ ఆరిపోయే దీపమని… ఇకపై జగన్ ఆటలు సాగవన్నారు
*ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేర‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రిక‌

సీఎం జగన్ ఓ సైకో అని, ఇంటికో సైకోను తయారు చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తండ్రి వైఎస్‌ను అడ్డుపెట్టుకుని రూ. లక్షల కోట్లు కొట్టేశారని ఆరోపించారు. ఆ ఆస్తులను కాపాడుకునేందుకు ఆయనకు పదవి కావాలని అన్నారు. 

కుప్పం నియోజకవర్గంలో మూడో రోజు పర్యటిస్తున్న చంద్రబాబు… కుప్పం మోడల్ కాలనీలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు…

కుప్పంలో 650 ఇళ్లతో మోడల్‌ కాలనీ నిర్మించామని, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ఆగిపోయిందని చెప్పారు. రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని ఆపేస్తున్నారని విమర్శించారు. కుప్పంలోని పేద ప్రజలకు అన్యాయం చేస్తూ, ప్రజలను‌ భయభ్రాంతులకు గురిచేస్తుంది వైసీపీ‌ ప్రభుత్వమని చంద్రబాబు ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో నిన్న జరిగిన కుప్పం ఘటన ఉదాహరణ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.

కుప్పం నియోజకవర్గంలో 33 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పూర్తి చేసుకున్నానన్నారు. కుప్పం చరిత్రలోనే నిన్న చీకటి రోజు అన్నారు. 

పోలీసుల సమక్షంలోనే అన్న క్యాంటీన్‌పై దాడి జరిగిందన్నారు. పోలీస్ వ్యవస్థ భ్రష్టుపట్టించారని, అందుకు డీజీపీ కారణమన్నారు.

సివిల్ డ్రస్ లో పోలీసులు కర్రలతో టీడీపీ కార్యకర్తలపై దాడి చేస్తారా‌? నా దగ్గర సాక్షాలన్ని ఉన్నాయి. ఖబర్దార్ వేటు పడుతుంది. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేసే విధంగా నడుచుకోకండి. వృత్తి ధర్మాన్ని పాటించండి అంటూ హెచ్చ‌రించారు.

సీఎం జగన్‌రెడ్డి ఎక్కడున్నా బయటకు రావాలని, రాష్ట్రంలో బ్రిటీష్ పాలన సాగనివ్వనని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, మద్యాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని ఆరోపించారు. వైసీపీ ఆరిపోయే దీపమన్నారు.

తాను సీఎంగా ఉన్న 14 ఏళ్లు పోలీసులను ఇలాగే వినియోగించి ఉంటే జగన్ పాద‌యాత్ర అనుకుని బయట తిరిగేవారా అని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో అభివృద్ధి చేయకుండా ఇప్పుడు గడపగడపకు అంటూ తిరుగుతున్నారని విమర్శించారు.

చెత్త మీద పన్ను వేసిన చెత్త ప్రభుత్వం, చెత్తను తీసుకెళ్లి జగన్ మీద వేస్తే కానీ బుద్ధి రాదని అన్నారు.నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ వాళ్ల అన్న జగన్ అని సంబోదించాడు.పులివెందులకు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నీళ్లు వచ్చాయని గుర్తుచేశారు.

Related posts