ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు విచారణల సందర్భంగా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇచ్చింది.
సీబీఐ కోర్టులో రోజువారీ విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి జగన్‌కు మినహాయింపు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి రోజు వారీ విచారణకు హాజరు కావాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది.
తన బదులు తన తరఫు న్యాయవాది హాజరుకు అనుమతివ్వాలన్నజగన్ అభ్యర్థనకు హైకోర్టు అంగీకారం తెలిపింది. అయితే సీబీఐ కోర్టు తప్పనిసరి అని భావించినప్పుడు మాత్రం జగన్ హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.
కాగా అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనని హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రతి శుక్రవారం విచారణకు మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది.
అయితే సీఎం హోదాలో పరిపాలన కార్యక్రమాలో బిజీగా వుండటం, మరిన్ని కారణాల నేపథ్యంలో వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఇటీవల వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరు కావడం లేదు. ఎప్పటికప్పుడు వ్యక్తిగత మినహాయింపు కోరుతూ ఆయన దాటేస్తూ వస్తున్నారు. దీంతో కోర్టు కూడా అసహనం వ్యక్తం చేస్తోంది.
దాడులు చేయడం ఈ ప్రభుత్వానికి అటవాటే: గోరంట్ల