వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్‌లో టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు గుప్పించారు. అవినీతి సామ్రాట్టులై ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. తమరు రాజ్యసభకు వెళ్లినా..అక్రమాస్తుల కేసులో ఏ2నే కదా అని గుర్తు చేశారు. తమ తోడు దొంగ సీఎం అయినా ఏ1 కాదా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. దొంగలకే దొంగ నువ్వు..దోపిడీ ముఠాలకు నాయకత్వం నీది. విజయమాయరెడ్డి గారని ఎద్దేవా చేశారు.
ప్రజావేదిక అక్రమ నిర్మాణమంటావు. కలెక్టర్ల సదస్సుకు వాడితే తప్పేంటంటావు. అక్రమాలు చేయాలన్నా..అక్రమాస్తులు కూడబెట్టాలన్నా ఏ1, ఏ2గా మీ రికార్డులు ఎవరూ అందుకోలేనివి. నీతి, నిజాయితీ గురించి ఏ1, ఏ2లు చెబుతుంటే వీరప్పన్ మొక్కలు పెంపకానికి పిలుపిచ్చినట్టు చెండాలంగా ఉందిని బుద్దా వెంకన్న ట్విట్టర్‌లో విమర్శలు చేశారు.