జనసేన పార్టీ కమిటీలను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు ప్రకటించనున్నారు. కమిటీల ఏర్పాటుపై సీనియర్ నేతలతో పవన్ చర్చించారు. ఎన్నికల ఫలితాలు, క్షేత్రస్థాయి సమాచారం ఆధారంగా అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో జనసేన పార్టీ కమిటీలను విజయవాడలో ప్రకటించనుంది.
రేపు ప్రకటించబోయే కమిటీలలో పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పి.ఎ.సి.), లోకల్ బాడీ ఎలక్షన్స్ కమిటీ, కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) మోనిటరింగ్ కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి మోనిటరింగ్ వంటి ముఖ్యమైన కమిటీలు ఉన్నట్టు జనసేన ఓ ప్రకటనలో పేర్కొంది. అన్ని పార్లమెంట్ స్థానాల పరిధిలో ధృడమైన పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది.