telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ లో ఉగ్రవాదం పోవాలంటే ఈ ఆర్టికల్ రద్దు తప్పదు: అమిత్ షా

amitsha about 370 article in campaign

కశ్మీర్ లో ఉగ్రవాదం పోవాలంటే ఆర్టికల్ 370 రద్దు తప్పదనిసరి అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.ఈ ఆర్టికల్ ఉన్నంత వరకూ కశ్మీర్ యువత భారత్ లో కలవదని పాక్ నేత జియావుల్ హక్ ఆనాడే చెప్పారని గుర్తుచేశారు. పాక్ ప్రేరేపిత వేర్పాటువాదుల వల్లే ఈ సమస్య తలెత్తిందని విమర్శించారు. ఆర్టికల్ 370 కోసం పట్టుబట్టే వారి పిల్లలు ఎక్కడున్నారో గుర్తుచేసుకోవాలని సూచించారు. వేర్పాటువాదుల పిల్లలంతా అమెరికా, ఇంగ్లాండు లలో చదువుకుంటున్నారని విమర్శించారు. జమ్ముకశ్మీర్ యువతకు మంచి భవిష్యత్తు అందించాలని అనుకుంటున్నామని తెలిపారు.

పాకిస్థాన్ కుట్ర పూరితంగా సాగించిన చర్యలకు ఇక్కడి యువత బలయ్యారని అన్నారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై అమిత్ షా వివరణ ఇస్తూ.. ఉగ్రవాదం అనే విషవృక్షాన్ని పెకిలించేందుకే కశ్మీర్ లో ఈ పరివర్తన ప్రయత్నాలు చేస్తున్నామని, ఆర్టికల్ 370 రద్దుతో అవన్నీ సాధ్యమవుతాయని చెప్పారు. డెబ్బై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఎవరూ ఈ ఆర్టికల్ ను కదిపే సాహసం చేయలేదని, ఒక తాత్కాలిక ఆర్టికల్ ను ఇలా ఎన్నాళ్లూ కొనసాగిస్తారని ప్రశ్నించారు.

Related posts