telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మె మొదలైన వారంలోనే కార్మికులపై కుట్రలు: మందకృష్ణ

MRPS manda krishna comments Chandrababu

ఆర్టీసీ సమ్మె మొదలైన మొదటి వారంలోనే కార్మికులపై తీవ్ర కుట్రలు చేశారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె 46 రోజులకు చేరిన సందర్భంగా దుబ్బాక బస్సు డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన..ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకే కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఏపీలో ఆర్టీసీని విలీనం చేసి తనకు లేనిపోని చిక్కుపెట్టాడని ఆ రాష్ట్ర సీఎం జగన్‌పై తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కోపం ఉందని చెప్పుకొచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకున్నారని, ఆర్టీసీ ఆస్తులను కూడా అమ్మేసి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అన్నారని అన్నారు. హైకోర్టు తీర్పు చూసి ఎంతో మంది ఆర్టీసీ కార్మికులకు కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని అన్నారు. కార్మికులు తమ లక్ష్యాన్ని సాధిస్తారని వారిలో ఉత్తేజాన్ని నింపారు.

Related posts