telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

అంతుచిక్కని “సైకిల్ ట్రీ”… ఎక్కడంటే…?

Cycle-Tree

ప్రపంచంలో ఎన్నో వింతలూ విశేషాలు మానవ తెలివికి అంతు చిక్కకుండా, మనుషులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంటాయి. వాటిలోని మర్మమేమిటో ఎవ్వరికీ తెలియదు. అలాంటి వాటి లిస్టులో ఈ “సైకిల్ ట్రీ”ని కూడా చేర్చుకోవచ్చు. అమెరికాలోని వాషన్ ఐలాండ్‌లో కనిపించే ఈ సైకిల్ ట్రీ మర్మమేమిటో ఇప్పటికీ ఎవరకీ అంతుచిక్కలేదు. అంత పెద్ద చెట్టు కాండం మధ్యలో ఆ సైకిల్ ఎలా ఇరుక్కుపోయిందో.. చూడటానికి అబ్బురంగా ఉంటుంది. అసలు ఆ సైకిల్ ఎవరిది? అక్కడకు ఎలా వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానాలు ప్రశ్నార్థకమే. ఒక కథ మాత్రం ప్రచారంలో ఉంది. ఈ దీవిలో ఓ చిన్న కుర్రాడు ఉండేవాడట. 1947-50 మధ్యప్రాంతంలో ప్రపంచ యుద్ధంలో పాల్గొనాల్సివచ్చి తన సైకిల్‌ని గొలుసుతో ఈ చెట్టుకు కట్టేసి వెళ్లిపోయి, అతని మళ్లీ తిరిగిరాలేదట. దాంతో చెట్టు మహావృక్షంగా ఎదిగే క్రమంలో ఈ సైకిల్ కూడా పైపైకి వెళ్లిపోయిందంటారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు.

Related posts