telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సంక్రాంతికి ప్రత్యేక బస్సులు..50 శాతం అదనపు ఛార్జీలు

Tsrtc Special Buses for Sankranti

సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. అదనంగా 5,252 బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజనల్‌ మేనేజర్‌ యాదగిరి తెలిపారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రత్యేక బస్సులకు 50 శాతం మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రాంతం వైపు వెళ్లేందుకు ఆన్‌లైన్‌లో ఎక్కువ బస్సులు అందుబాటులో ఉంచామని చెప్పారు.

ఈ నెల 10 నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలకు జేబీఎస్‌ నుంచి బస్సులు నడుస్తాయని యాదగిరి చెప్పారు. నల్గొండ, కోదాడ, యాదగిరి గుట్ట, వరంగల్‌ జిల్లాలకు ఉప్పల్‌ నుంచి బస్సులు వెళ్తాయని తెలిపారు. కడప, నంద్యాల వైపు కాచిగూడ నుంచి, కర్నూలు, అనంతపురం వెళ్లే బస్సులు పాత సీబీఎస్‌ నుంచి వెళ్తాయని ఆర్‌ఎం చెప్పారు. ఖమ్మం జిల్లాకు మాత్రం ఎంజీబీఎస్‌ నుంచే వెళ్తాయన్నారు.

Related posts