telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఐకాన్” ఆగిపోలేదు… స్పష్టం చేసిన దర్శకుడు

Icon

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో “ఐకాన్” మూవీ తెరకెక్కాల్సి వుంది. అయితే “నా పేరు సూర్య”తో తీవ్రంగా నిరాశ పడ్డ బన్నీ… సుకుమార్, వేణు శ్రీరామ్ ప్రాజెక్ట్స్ పక్కన పెట్టారు. ఆ తరువాత త్రివిక్రమ్ తో “అల వైకుంఠపురంలో” అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం సుకుమార్ తో “పుష్ప” చేస్తున్న బన్నీ తన 21వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ప్రకటించారు. దీనితో “ఐకాన్” మూవీ ఇక ఆగిపోయినట్లే అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘వకీల్ సాబ్ ‘సినిమా చేస్తున్నాడు. తాజాగా వేణు శ్రీరామ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘ఐకాన్’ సినిమా పై క్లారిటీ ఇచ్చాడు. ఈ చిత్రం ఆగిపోలేదనీ, ఈ సినిమా విషయంలో తాను బన్నీతో టచ్ లోనే ఉన్నాననీ దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. అన్నీకుదిరితే కొరటాల సినిమా తర్వాత ‘ఐకాన్’ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.

Related posts