telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కంగ్రాట్స్ రామూ తాతయ్యగారూ…” వర్మకు రాజమౌళి ట్వీట్… విషయమేమంటే…!?

Rajamouli

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమా ప్రమోషన్లలో అప్పుడప్పుడు రాజమౌళిని కూడా వాడుకుంటూ ఉంటారు. ఈసారి దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి షాకిచ్చారు. ఆయన కూతురు రేవతి ఈరోజు ఉదయం పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ తనదైన శైలిలో కామెంట్ చేసారు. “కంగ్రాట్స్ రామూ తాతయ్యగారూ… మీ మనవరాలు మిమ్మల్ని ఏలేంత గొప్పది అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకీ మీరు ఎలా పిలిపించుకోవడానికి ఇష్టపడతారు? రాము తాతా, రాము నాన్న లేకపోతే గ్రాండ్‌పా రామూనా?’ అని ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌ను ఇప్పటివరకే ఏడువేల మందికి పైగా లైక్స్ చేసారు. ఇక వర్మ కూతురు రేవతి విషయానికొస్తే.. ఓసారి వర్మ తన కూతురి కాపురం గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్ చేసారు. ‘నా కూతరు, అల్లుడు ఎంత అన్యోన్యంగా ఉంటారంటే.. వారిని చూసి బోర్ కొట్టింది. ఎప్పుడైనా ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది’ అన్నారు.

Related posts