telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆచార్య’ ట్విట్ట‌ర్ టాక్‌ ఎలా ఉందంటే..

మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్​స్టార్ రామ్​చరణ్​ కాంబినేషన్​లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రం నేడుప్రపంచ వ్యాప్తంగా 2 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలయింది.

దేవాలయాల ప్రాముఖ్యత, వాటిని అడ్డుపెట్టుకుని కొంతమంది చేసే అవినీతిని చూపించే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. పూజాహెగ్డే, సోనూసూద్​ ప్రధాన పాత్రల్లో నటించారు.

చిరంజీవితో రామ్‌ చరణ్‌ కలిసి తొలిసారి పూర్తి స్థాయిలో స్క్రీన్​ షేర్​ చేసుకోవడంతో ‘ఆచార్య’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు భారీ స్పందన రావడం, ప్రమోషన్స్‌ కూడా ఓ రేంజ్‌లో నిర్వహించడంతో ఈ సినిమాపై హైప్‌ క్రియేట్‌ అయింది.

ఇప్పటికే యూఎస్, తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ షోలు పడటంతో ట్విట్టర్ వేదికగా ‘ఆచార్య’పై తమ అభిప్రాయాలను నెటిజన్లుపంచుకున్నారు .

ఆచార్య ఫస్టాఫ్ ఓకే అనిపించిందని, సెకండాఫ్‌లో మెగా తండ్రీకొడుకులు రామ్ చరణ్, చిరంజీవి సీన్స్ పూనకాలు తెప్పించాయని అంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ రోల్ ఈ సినిమాకు ప్రాణం అని చెబుతుండటం గమనార్హం. ఇంటర్వెల్ సీన్‌లో సిద్ద ఇరగదీశాడని చెబుతున్నారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందనే టాక్ బయటకొచ్చింది. ఓవరాల్‌గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనే వారు ఎక్కువ మందే ఉన్నారు.

ఫస్టాప్‌ డీసెంట్‌గా ఉందని, సెకండాఫ్‌లో చివరి 40 నిమిషాలు మెగా ఫ్యాన్స్‌ కోసమే అన్నట్లుగా ఉంది. బీజీఎం, పాటలు బాగున్నాయి. క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా ఉండడంతో పాటు హిందూ మతం గురించి ఓ చిన్న సందేశం కూడా ఉంది’అని ఓ నెటిజన్‌ కామెంట్‌ చేశారు.

మరోవైపు ఆచార్య సినిమా పట్ల నెగెటివ్ కామెంట్స్ మోత మోగుతున్నాయి. కొరటాల శివ నుంచి ఈ తరహా స్క్రిప్ట్ ఊహించలేదని, స్టోరీ చాలా వీక్‌గా ఉందనే కోణంలో నెటిజన్ల ట్వీట్స్ కనిపిస్తున్నాయి.

కొరటాల గత చిత్రాలతో ఏమాత్రం పోల్చే విధంగా ఈ సినిమా లేదనే టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఫస్టాఫ్ అంతా సాగదీతగా ఉందని, క్లైమాక్స్‌ ఎమోషనల్‌ సీన్స్ కాస్త పర్వాలేదని అంటున్నారు. ఓవరాల్‌గా ఇప్పటివరకు వచ్చిన ట్వీట్స్ ఆధారంగా చెప్పాలంటే ఆచార్యకు మిశ్రమ స్పందనే దక్కింది.

Related posts