telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మాసివ్ హార్ట్ ఎటాక్ నుండి నన్ను సేవ్ చేశారు… క్షేమంగానే ఉన్నా… : శశిప్రీతమ్

Shashi-preetham

ప్రముఖ సంగీత దర్శకుడు శశిప్రీతమ్ కు గత కొన్ని రోజులక్రితం గుండె పోటు రావడంతో ఆయనను హుటాహుటిన బంజారాహీల్స్ లోని సెంచరీ ఆస్పత్రికి తరలించారు. జూన్ 4 ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో బంజారాహిల్స్‌లోని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు హార్ట్ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆప్పత్రిలో చికిత్స పొందుతున్న శశిప్రీతమ్ ఓ వీడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ “ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనెల 4వ తేదీ ఉదయం నాకు గుండెపోటు వచ్చింది. వెంటనే నా మిత్రుడు రాజు గారు బంజారాహిల్స్ సెంచరీ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. హార్ట్ లో బ్లాక్ ఉందని యాంజియోప్లాస్టి చేశారు. ఒక స్టంట్ వేశారు. మాసివ్ హార్ట్ ఎటాక్ నుండి నన్ను సేవ్ చేశారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నారు. నేను త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, శ్రేయోభిలాషులు అందరికీ పేరుపేరునా థాంక్స్” అని వీడియోలో తెలిపారు. తెలుగులో సినిమాలతో పాటు సీరియల్స్‌కు కూడా మ్యూజిక్ అందించారు శశిప్రీతమ్. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా కృష్ణవంశీ తెరకెక్కించిన గులాబీ సినిమాతో సింగర్‌గా టాలీవుడ్‌లో అడుగు పెట్టారు. ఆ తర్వాత 21 తెలుగు సినిమాలతో పాటు అరడజన్ హిందీ సినిమాలకు కూడా సంగీతం అందించారు శశి ప్రీతమ్. వీడియో డాక్యుమెంటరీలు, యాడ్స్, సీరియల్స్ కూడా చేసారు.

Related posts