telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ప్రపంచానికి మరో మెడికల్ ఛాలెంజ్.. వణికిస్తున్న ఫంగస్ ..

fungus as new challenge to world

ప్రపంచం ఎదుట మరో మెడికల్ ఛాలెంజ్ తయారైంది. అదొక ఫంగస్, దానితో మాయరోగం కబళిస్తోంది. మనుషుల పాలిట శాపంగా మారుతోంది. రోజులు కాదు గంటలోనే ప్రాణాన్ని హరిస్తోంది. ప్రస్తుతం ‘క్యాండీడా ఆరిస్’ ఫంగస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ ఫంగస్ పేరు క్యాండిడా ఆర్ ఎస్ అలియాస్ జపనీస్ ఫంగస్ గా పిలుస్తారు. ఈ ఫంగస్ చెవిలో నుంచి మొదలవుతుంది. ఎక్కువ శాతం ఈ జపనీస్ ఫంగస్ డయాబెటిస్, క్యాన్సర్ పేషెంట్ లలో కనిపిస్తుంది. శరీరంలో యాంటీ బయాటిక్స్ వల్ల రియాక్షన్ ఏర్పడి చెవి నుంచి మెదడు, గుండెకు ఇలా శరీరమంతా పాకి కేవలం మూడు నిమిషాల్లో శరీరం మొత్తం విషంలా మారుతోంది. ఈ వైరస్ ఎంటరైతే బతకడం దాదాపు కష్టమే అంటున్నారు వైద్యులు.ఎంత పవర్ ఫుల్ మందులు వాడినా లొంగని ఫంగస్, ఇది యాంటీ బయాటిక్స్ వల్ల రోగ నిరోధక శక్తి అంతరించి ఈ వైరస్ వ్యాప్తికి దోహదమవుతుందని అమెరికా బ్రిటన్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. అనేక దేశాల్లో జపనీస్ ఫంగస్ వేగంగా విస్తరిస్తోందని అమెరికా లోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సైంటిస్టులు చెపుతున్నారు.

ఇండియా, అమెరికా, బ్రిటన్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్ లలో దీని ముప్పు ఎక్కువగా ఉందని తేల్చారు. ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణించే వ్యక్తుల ద్వారా ఈ ఫంగస్ ఇతర దేశాలు కూడా పాకుతున్నట్లు పేర్కొంటున్నారు.ఈ మహమ్మారి ఫంగస్ జపాన్ నుంచి ప్రపంచ దేశాలకూ పాకింది. దీనిని తొలి సారిగా రెండు వేల తొమ్మిది టోక్యో మెట్రో పాలిటన్ జడియాటిక్ హాస్పిటళ్లు గుర్తించారు. ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉండే రోగులకు ఈ ఫంగస్ పాకుతుంది. ఈ ఫంగస్ రక్తనాళాలు, ఊపిరితిత్తులోకి చేరితే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. ఈ ఫంగస్ రక్తనాళాల ద్వారా ఎక్కడైనా చేరుకోగలదు. ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్ వంటి వాటిని నాశనం చేస్తుంది. ఒక్కసారి మెదడు వరకూ వెళ్లి నాడీవ్యవస్థను దెబ్బ తీస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ ఫంగస్ సోకిన వాళ్లలో అరవై శాతం మంది చనిపోయారని వైద్యులు పేర్కొంటున్నారు. ఊపిరితిత్తులకు ఈ ఫంగస్ సోకితే సకాలంలో గుర్తించటం కష్టమవుతుందనే దీనివల్ల ట్రీట్మెంట్ ఆలస్యమవుతుందని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్ కు చెందిన డాక్టర్ ఎలెన్ కోట్ మాన్ వెల్లడించారు. చాలాసార్లు దీనిని వేరొక ఫంగస్ ఇన్ఫెక్షన్ గా భావించి మందులు ఇస్తుండటంతో సైలెంట్ గా పెరిగిపోతోందంటున్నారు. యాంటీ ఫంగల్ మందులను తట్టుకునేలా దీనిలో జన్యు పరమైన మార్పులు జరిగాయంటున్నారు. మనిషి బాడీ టెంపరేచర్ కు సమానంగా ముప్పై ఆరు, ముప్పై ఏడు డిగ్రీల సెంటీగ్రేడ్ ల వేడి వాతావరణంలో ఫంగస్ మనుగడ సాగించగలదని సీడీసీ సైంటిస్టులు వెల్లడించారు.

Related posts