telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇంటర్నెట్ ద్వారా ఓటు వేసే అవకాశం…?

voter list in rangareddy district released

మన దేశంలో ప్రస్తుతం ఎన్నికల వేడి కొనసాగుతుంది. దాంతో పార్టీలు అన్ని ప్రచారాలు ఇప్పటికే ప్రారంభించాయి. దాంతో దేశంలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి మొదలైంది.  ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.  ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని మానిటరింగ్ చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.  ఎన్నికల విధుల్లో పాల్గొనే వ్యక్తులకు ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది.  అయితే, ఇప్పుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రాంతాల్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకోలేని వారికోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓ అవకాశం కల్పించేందుకు సిద్ధం అయ్యింది.  దూరప్రాంతాల్లో ఉండే వ్యక్తులు ఇంటర్నెట్ ద్వారా ఓటు వేసే వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకుంది.  త్వరలోనే రిమోట్ ఓటింగ్ సిస్టమ్ ను తీసుకురాబోతున్నది.  ఈ విధానం అమల్లోకి వస్తే దూరప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు అక్కడి నుంచే ఇంటర్నెట్ ద్వారా ఓటు వేసుకోవచ్చు. అయితే చూడాలి మరి ఈ అవకాశాన్ని ఈసారి ఎన్నికల్లోనే కల్పిస్తారా… లేదా వచ్చే ఎన్నికలో ఉపయోగిస్తారా… అనేది.

Related posts