telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

పుదుచ్చేరిలో కూడా ‘పది’ పరీక్షలు రద్దు

Naraayanaswamy cm Puduchceri

కరోనా సంక్షోభంలో పరీక్షలు నిర్వహించలేమని ఆయా రాష్ట్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ ఎంతో కష్టసాధ్యమైన విషయంగా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్ ను ఆయా ప్రభుత్వాలు రద్దు చేశాయి.

ఇప్పుడు కేంద్ర పాలితప్రాంతం పుదుచ్చేరి కూడా అదేబాటలో నడిచింది. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. పబ్లిక్ పరీక్షలు లేకుండానే పదో తరగతి విద్యార్థులు తర్వాతి తరగతులకు ప్రమోట్ అవుతారని పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి వెల్లడించారు. కాగా, పుదుచ్చేరిలో ఇప్పటివరకు 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 36 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు.

Related posts