telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మెగాహీరో సినిమాలో … పొలిటీషియన్ గా రమ్యకృష్ణ

ramyakrishna

రమ్యకృష్ణ సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ హీరోగా ‘ప్రస్థానం’ ఫేం దేవాకట్టా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ నటిస్తున్నట్టు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ పొలిటీషియన్ రోల్‌లో రమ్యకృష్ణ కనిపిస్తారట. ఇదే నిజమైతే మరోసారి రమ్యకృష్ణ నట విశ్వరూపాన్ని వెండితెరపై చూసేయొచ్చు. కాగా, పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. జగపతిబాబు, రాహుల్ రామకృష్ణ, రమ్యకృష్ణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నారు.

Related posts