కరోనా వైరస్ వ్యాపించడంతో పలు దేశాల్లో విద్యా సంస్థలకు సెలవులు ఇస్తుండడంతో భారతీయులు స్వదేశానికి బయల్దేరుతున్నారు. తెలుగు విద్యార్థులు స్వదేశానికి రాలేక కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు.
కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ పూరీకి కేటీఆర్ ట్వీట్ చేశారు. మనీలా, కౌలాలంపూర్, రోమ్‌లోని విమానాశ్రయాల్లో చిక్కుకుపోయిన భారతీయుల నుంచి తనకు మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. వారి పరిస్థితుల గురించి వెంటనే స్పందించి, వారిని స్వదేశానికి తీసుకురావాలని తాను భారత ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పారు.
మారని బంగ్లా ఆటగాళ్ల తీరు…