కరోనావైరస్ కట్టడి కోసం లాక్ డౌన్ విధించడంతో పలు సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పలు సంస్థలు సిబ్బందిని కుదిస్తున్నాయి.ఇప్పుడీ కోవలోకి యూకే ఇంజనీరింగ్ దిగ్గజం రోల్స్ రాయిస్ హోల్డింగ్స్ వచ్చి చేరింది. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నామని, ఖర్చులు తగ్గించుకునేందుకు 9 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పడం లేదని పేర్కొంది.
ఉద్యోగుల తొలగింపుతో 1.3 బిలియన్ డాలర్లు ఆదా కానున్నట్టు తెలిపింది.17 వంతు ఉద్యోగులను తొలగించాలన్న ఈ నిర్ణయం తమ సివిల్ ఏరోస్పేస్ విభాగాన్ని ప్రభావితం చేస్తుందని, ఇది తయారీ సంక్షోభం కాకపోయినా ఇతర సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని రోల్స్ రాయిస్ సీఈవో బాస్ వారెన్ ఈస్ట్ పేర్కొన్నారు. ఉద్యోగ కోతల్లో ఎక్కువ భాగం యూకేలోనే ఉంటాయని తెలుస్తోంది.
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్