telugu navyamedia
సినిమా వార్తలు

బెల్లంకొండ శ్రీనివాస్ “రాక్షసుడు” వాయిదా

rakshasudu movie release date

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “రాక్షసుడు”. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ అయిన “రాచ్చసన్” చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. వరుస హత్యలు, ముఖ్యంగా స్కూల్ కి వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేసి చంపే సీరియల్ కిల్లర్ ని పట్టుకోవడానికి సినిమాలో హీరో ఏం చేశాడనేదే కథ. ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అందుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు బెల్లంకొండ. ఈ సినిమాను కోనేరు సత్యనారాయణ నిర్మించారు. జూలై 18న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ఇంతకుముందు ప్రకటించారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని ఆగ‌స్ట్ 2న విడుద‌ల చేస్తున్నారు. ఎ హ‌వీష్ ల‌క్ష్మ‌ణ్ కొనేరు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌పై కొనేరు స‌త్య‌నారాయ‌ణ నిర్మాత‌గా రూపొందుతోంది ఈ చిత్రం. ప్ర‌ముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తమ్ముడు సాగర్ డైలాగ్ రైటర్ గా పరిచయం అవుతున్నారు. ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌కు సంబంధించిన వార్త అధికారికంగా వెలువడనుంది.

Related posts