telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ దర్శకుడికి తీవ్ర గాయాలు

Sushindran

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సుశీంద్రన్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయలతో ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనలో ఆయన ఎడమ చేయి ఎముక విరిగింది. సుశీంద్రన్ రోజూ ఉదయాన్నే వాకింగ్‌ చేస్తారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళుతుండగా బైక్‌పై వచ్చిన వ్యక్తి వెనకనుండి సుశీంద్రన్‌ను ఢీకొన్నారు. దీంతో కింద పడిన సుశీంద్రన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఎడమ చేతి ఎముక విరిగింది. దీంతో ఆయణ్ణి ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. గాయాలు తీవ్రం కావడంతో కొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు సూచించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘వెన్నెలా కబడ్డీ కుళు’ (భీమిలి కబడ్డీ జట్టు) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన సుశీంద్రన్‌ ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. కార్తీతో ‘నా పేరు శివ’, విశాల్‌తో ‘పల్నాడు’, ‘జయసూర్య’, విక్రమ్‌తో ‘వీడింతే’, వంటి చిత్రాలు చేశారు. ఆయన దర్శకత్వం వహించిన ‘కెనడీ క్లబ్’, ‘ఛాంపియన్‌’ సినిమాలు ఇటీవలే విడుదలయ్యాయి.

Related posts