telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

తమ సైనికులకు కరోనా వ్యాక్సిన్ అందించిన రష్యా…

corona vacccine covid-19

ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే వీటిలో రష్యా కూడా ఒకటి. కరోనా వ్యాక్సిన్ తయారీ కోసం అనేక విధాల ప్రయత్నాలు చేస్తోంది. ఇంతకు ముందు ఒకసారీ కరోనా వ్యాక్సిన్ తయారు చేసినట్లు ప్రకటించింది. అప్పట్లో రష్యా ప్రెసిడెంట్‌ కూడా ఆ వ్యాక్సిన్‌ను ఇంజక్సన్ తీసుకున్నట్లు తెలిపారు. కానీ దేశంలో కరోనా ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇటీవల స్పుత్నిక్ వి అనే టీకాలను తయారు చేసినట్లు తెలిపింది. అయితే ఈ సారీ దాదాపు 10వేల మంది సైనికులకు ఈ టీకాలు వేశామని, వారికి ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖకు మొత్తం 14,500 టీకాలు వచ్చాయని, వాటిలో డిసెంబరు 10నాటికి పదివేల మందికి టీకాలు వేశామని చెప్పారు. వ్యాక్సిన్ ట్రైయిల్స్ విజవంతం అయ్యాయని, వీటిని వేసిన సైనికుల్లో రోగనిరోధక శక్తి పెరిగింని వివరించారు. ఈ టీకాలను సైకులందరూ స్వచ్ఛందంగా తీసుకున్నారని, ఎటువంటి బలవంతం జరగలేదని తెలిపారు. ఈ టీకాలను వేయడానికి 300 వైద్య బ్రిగేడ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. కానీ ఈ వ్యాక్సిన్ ను బయటి దేశాలు అంగీకరించకపోవడంతో ఇవి ఎక్కడికి రావడం లేదు.

Related posts