telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఆమె బిచ్చగత్తె… కానీ ఆమె ఖాతాలో ఉన్న సొమ్ము తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే…!?

Beggar

లెబనాన్ ప్రజల దాతృత్వం ఆ బిచ్చగత్తెను కోటీశ్వరురాలిని చేసింది. ఏళ్ల తరబడి బిచ్చం ఎత్తుకుంటున్న ఆ మహిళ బ్యాంకు అకౌంట్‌లో ఉన్న సొమ్ము ఇప్పుడు అక్కడి అధికారులతో పాటు ప్రజలను నోరెళ్లబెట్టేలా చేసింది. రోజూ తమ వద్ద బిచ్చం ఎత్తుకొని పొట్ట నింపుకునే ఆమె వద్ద భారీ మొత్తంలో నగదు ఉండడం అక్కడి జనాలను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇక ఆమెను దగ్గర నుంచి చూసిన వారికైతే నోటమాట రావడం లేదట. ఆమె పేరు వఫా మొహమ్మద్ అవద్. ఈమెకు సంబంధించిన బ్యాంకు చెక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ చెక్ విలువ ఎంతో తెలుసా ? అక్షరాల రూ. 6 కోట్ల 38 లక్షలు. లెబనాన్‌లోని సైదా నగరంలో బిచ్చం ఎత్తుకునే వఫా వచ్చిన సొమ్మును జమాల్ ట్రస్ట్ బ్యాంకులో దాచిపెట్టింది. తాజాగా ఆమె ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నందున తన పొదుపులను మరొక బ్యాంకుకు బదిలీ చేయడానికి బ్యాంకుకు వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో చెక్‌కు సంబంధించిన ఫొటో బయటకు రావడంతో అది కాస్తా అంతర్జాలంలో వైరల్‌గా మారింది. ఇన్నాళ్లు దాతృత్వం పేరిట ఆమెకు డబ్బు ఇచ్చిన చాలా మంది ప్రజల కంటే ఇప్పుడు వఫా ధనవంతురాలు. ఇది తెలిసిన అక్కడి వారు అవాక్కవుతున్నారు.

Related posts