telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఘనంగా ఏపీ అవతరణ దినోత్సవ వేడుకలు..తెలుగులో మోడీ ట్వీట్

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ {నవంబర్‌ 1వ తేదీ} ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరజీవి పొట్టిశ్రీరాములుకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, పాల్గొన్నారు. కాగా ఆయా జిల్లాల్లో ఇన్‌చార్జి మంత్రులు, కలెక్టర్ల ఆధ్వర్యంలో అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్బంగా ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ కూడా శుభాకాంక్షలు తెలిపారు. “కృషికి, సహృదయతకి ఆంధ్రప్రదేశ్ మారుపేరు. ఆంధ్రులు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణ దినోత్సవ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభివృద్ధికై ప్రార్ధిస్తున్నాను.” అంటూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. 

Related posts