telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వెంకీ మామ : “కోకా కోలా పెప్సీ” లిరికల్ వీడియో సాంగ్

Venky-Mama

టాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్ట్‌గా రూపొందుతోన్న మ‌ల్టీస్టారర్ `వెంకీమామ‌`. విక్ట‌రీ వెంక‌టేశ్‌, యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య న‌టిస్తున్నారు. రాశీఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప‌తాకాల‌పై కె.ఎస్‌.ర‌వీంద్ర(బాబీ) ద‌ర్శ‌క‌త్వంలో డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ కోసం ఇద్ద‌రి హీరోల అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 13న విడుద‌ల చేస్తున్నారు. అక్కినేని నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా పుట్టిన‌రోజుల సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించి వారి టీజ‌ర్స్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. తాజాగా ఇప్పుడు వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి “కోకా కోలా పెప్సీ” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ మాస్ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts