telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“రెడ్‌” నుంచి మరో సాంగ్‌ రిలీజ్‌

‘ఇస్మార్ట్ శంకర్’తో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం తీసుకొచ్చిన రామ్, ఈ సంక్రాంతి పండక్కి ‘రెడ్’ సినిమా తో థియేటర్లలోకి రానున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ‘’ఇటీవలే సెన్సార్ కూడా పూర్తయింది. U/A సర్టిఫికేట్ వచ్చింది.అయితే… ఈ సినిమా నుంచి నువ్వే…నువ్వే వీడియో సాంగ్‌ను తాజాగా రిలీజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈ సాంగ్‌ రిలీజ్‌ చేసిన క్షణాల్లోనే వేలల్లో వ్యూస్‌ వచ్చాయి. ఈ సాంగ్‌లో రామ్‌, మాళవిక శర్మ మధ్య రొమాన్స్‌ బాగా చూపించారు. అయితే.. ఈ సాంగ్‌ కూడా డించక్ సాంగ్‌ లాగే రికార్డులు సృష్టిస్తుందని సిని యూనిట్‌ భావిస్తుంది.

Related posts