telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అనుష్క ఖాతాలో సరికొత్త రికార్డు

Anushka

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది అనుష్క.. దాదాపుగా 15 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో ఉంటూ అందరూ స్టార్ హీరోలతో వర్క్ చేసింది అనుష్క.. తమిళ్ , తెలుగు, కన్నడ భాషలలో కలిపి అనుష్క 50 కి పైగా సినిమాలలో నటించింది. ఇక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది అనుష్క. అందులో భాగంగా వచ్చిన అరుంధతి, రుద్రమదేవి, బాగుమతి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి..ప్రస్తుతం అనుష్క నిశబ్దం అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అనుష్క సినిమాలలో ఎలా కనిపించినా… పబ్లిక్‌లో మాత్రం చాలా పద్ధతిగా కనిపిస్తూ అందరినీ ఫిదా చేస్తుంది. సోషల్‌ మీడియాలో కూడా చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. అయినప్పటికీ సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో అనుష్క ఇప్పుడు సరికొత్త రికార్డ్ ను క్రియేట్‌ చేసింది. ఫేస్‌బుక్‌ పరంగా ఇప్పటి వరకు కాజల్‌, తమన్నాలకే సాధ్యమైన గుర్తింపు, రికార్డ్ ఇప్పుడు అనుష్కకు కూడా దక్కింది. 23 మిలియన్‌ ఫాలోవర్స్‌ని సాధించి కాజల్‌, తమన్నాల సరసన చేరింది స్వీటీ అనుష్క. అనుష్క 2 కోట్ల 30 లక్షల ఫాలోవర్స్‌-కోటి 44 లక్షల లైక్స్‌ రెండవ స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు సోషల్‌ మీడియాలో అత్యధిక ఫాలోవర్స్‌, లైక్స్‌ ఉన్న రికార్డ్ కాజల్‌ పేరిట ఉంది. కాజల్‌కు 2 కోట్ల 35 లక్షల ఫాలోవర్స్‌-2కోట్ల 34 లక్షల లైక్స్‌ ఉండగా.. తమన్నా 2 కోట్ల 30 లక్షల ఫాలోవర్స్‌- కోటి 22 లక్షల లైక్స్ తో మూడవ స్థానంలో ఉంది. ఈ విషయంలో టాప్‌ సెలబ్రిటీలైన రజినీకాంత్‌, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ వంటి వారిని బీట్‌ చేసి హీరోయిన్లు టాప్‌ ప్లేస్‌ని సొంతం చేసుకోవడం విశేషం.

Related posts