కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలు ముమ్మరం చేస్తున్న సంగతి తెలిసిందే. టీకా అభివృద్దిలో అన్ని వ్యాక్సిన్ల కన్నా ముందుందని భావిస్తున్న ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ టీకా వేయించుకున్న ఓ వాలంటీరుకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ప్రయోగాలు నిలిచిపోయాయి.
బ్రిటన్ లో టీకా తీసుకున్న వ్యక్తి తీవ్ర అనారోగ్యం బారిన పడటంతో తుది దిశకు చేరిన క్లినికల్ ట్రయల్స్ ను నిలిపివేశామని ఆస్ట్రాజెనికా ఓ ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్ భద్రతపై మరోసారి పూర్తిస్థాయిలో సమీక్షిస్తామని ఆస్ట్రాజెనికా తెలిపింది. వాలంటీర్ కు ఎటువంటి అనారోగ్య సమస్య ఏర్పడిందన్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు.