telugu navyamedia
సినిమా వార్తలు

డ్రగ్స్ పార్టీ ఆరోపణలపై స్పందించిన కరణ్ జోహార్

Karan-Johar

ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఇటీవల తన ఇంట్లో పలువురు బాలీవుడ్ సెలెబ్రెటీలకు పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో దీపికా పదుకొణే, రణబీర్ కపూర్, అర్జున్ కపూర్, మలైకా అరోరా, విక్కీ కౌశల్, షాహిద్ కపూర్ సహా తదితరులు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన ఓ వీడియోను కరణ్ జోహార్ తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అయితే తాజాగా శిరోమణి అకాలీదళ్ ఎమ్మెల్యే మజీందర్ సిర్సా ట్విట్టర్‌లో వారిపై ఫైర్ అయ్యారు. ఈ ఆరోపణలపై ఇన్నాళ్లు మౌనం వహించిన కరణ్ జోహార్.. ఎట్టకేలకు నోరు విప్పారు. ఒకవేళ తన ఇంట్లో జరిగిన పార్టీలో నిజంగానే డ్రగ్స్ తీసుకుని ఉంటే.. ఆ వీడియోను తానే ఎందుకు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తానని, అలా పెట్టడానికి తానేమీ స్టుపిడ్‌ని కాదని కరణ్ జోహార్ ప్రశ్నించారు. వీకెండ్ కావడంతో.. అందరం సరదాగా కలుసుకుని.. వైన్ తాగుతూ మాట్లాడుకున్నామని చెప్పారు. తాను ఆ వీడియో తీయడానికి కొద్దిసేపటి ముందువరకు కూడా మా అమ్మ అక్కడే ఉందని కరణ్ జోహార్ తెలిపారు. జర్నలిస్ట్ రాజీవ్ మసంద్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ ఈ విషయాలు వెల్లడించారు. ఇదే వీడియోలో దర్శకుడు విక్కీ కౌశల్‌‌‌ను చూసి.. అతను డ్రగ్ పౌడర్‌ తీసుకున్నాడని కొంతమంది ఆరోపించారు. దానిపై కరణ్ జోహార్ స్పందిస్తూ… “ముక్కు గోక్కోవడానికి కూడా పర్మిషన్ లేదు.. ఫోన్ ను బ్యాక్ పాకెట్‌లో పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ లేదు. అలాగే ఏదో ఊహించుకుని డ్రగ్ పౌడర్ అంటున్నారు’ అని ఎద్దేవా చేశారు. నిజానికి తాను ఈ ఆరోపణలపై స్పందించాలనుకోలేదని.. కానీ స్పందించక తప్పట్లేదు” అని అన్నారు. తమపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఆరోజు రాత్రి లైట్ మ్యూజిక్, పాటలు,సరదా ముచ్చట్లతో గడిపామని చెప్పారు. 

Related posts