telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒక్క ఫొటోతో తన బలం ఏంటో బయటపెట్టిన వరుణ్ తేజ్

Varun-Tej

మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది “ఎఫ్-2”, “గద్దలకొండ గణేష్” చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు వరుణ్ మరో వినూత్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాబోయే కొత్త చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి రూపొందించనున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అల్లు వెంకటేష్, ముద్దా సిద్దు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో. మొదట్లో కాస్త కంగారు పడినా కూడా తర్వాత మెల్లగా తనకంటూ ఫాలోయింగ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు వరుణ్ తేజ్. వరస విజయాలతో దూసుకుపోతున్నాడు మెగా ప్రిన్స్. ఇప్పుడు ఈయన చేస్తున్న సినిమాలపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ యంగ్ హీరో తాజాగా తన నాన్న నాగబాబుతో పాటు పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కల్యాణ్ ఫోటోలు పోస్ట్ చేసాడు వరుణ్ తేజ్. వీళ్లే నా బలం అంటూ పోస్ట్ చేసాడు. ఇది చూసి మెగా ఫ్యాన్స్ కూడా ఫిదా అయిపోతున్నారు.

Related posts