రాజమౌళి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగిపోవడం ఖాయం. రాజమౌళి ఎలాంటి సినిమా తీసిన అందులో ఏదో మ్యాజిక్ ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అయితే రాజమౌళి ఇప్పటివరకు తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను నమోదు చేశాయి. ఇక తాజాగా విడుదలైన బాహుబలితో అయితే… అప్పటి వరకు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన రాజమౌళి ఫాలోయింగ్ ప్రస్తుతం ప్రపంచం నలుమూలలా పాకేలా చేసింది. ప్రపంచం మొత్తం సెన్సేషనల్ కలెక్షన్లను రాబట్టి అఅన్ని ఇండస్ట్రీలో రికార్డు సృష్టించింది బాహుబలి సినిమా. బాహుబలి తర్వాత రాజమౌళి కక్రేజ్ ఇంటర్నేషనల్ లెవల్లో మార్మోగి పోవడంతో… ప్రపంచవ్యాప్తంగా ఆయన డైరెక్షన్ కి అభిమానులు ఏర్పడ్డారు. దీంతో ఆయన గురించి ఇలాంటి అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. అయితే బాహుబలి సినిమాకి ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు కూడా వచ్చాయి.
తాజాగా బాహుబలి సినిమా కి ఓ అరుదైన గౌరవం దక్కింది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు ముందు బాహుబలి ది బిగినింగ్ ప్రదర్శించారు. అంత గొప్ప హాల్ లో ఒక తెలుగు సినిమాను అది తెలుగు లాంగ్వేజ్ లో ప్లే చేయడం నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ విషయం. ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో దాదాపు 5 వేల మందికి పైగా ప్రేక్షకులు ముందు బాహుబలి సినిమాని ప్రదర్శించగా… ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిత్ర నటీనటులు ప్రభాస్ రానా అనుష్క ల తో పాటు నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు రాజమౌళి కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి సాంప్రదాయ దుస్తులు .. పంచెకట్టులో అక్కడికి వెళ్లారు. దీంతో అక్కడ ఆయన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు రాజమౌళి. అయితే లండన్ లో ప్రదర్శించబడే బాహుబలి సినిమా చూడడానికి జపాన్ నుంచి కొంతమంది అమ్మాయిలు రావడం గమనార్హం . వారంతా జక్కన్న తో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు.