telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షర్మిల పార్టీపై కౌంటర్‌ వేసిన ఎర్రబెల్లి !

erraballi dayaaker

గత కొన్ని రోజులుగా వైఎస్ షర్మిల షర్మిల ఏం చేసిన అదో హాట్ టాపిక్ గా మారుతుంది. ఎందుకంటే… తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల.. ఆ తర్వాత రోజు.. ముఖ్య అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.. హైదరాబాద్‌లో ఓ కార్యాలయం ఏర్పాటు చేసుకోవడంతో పాటు.. ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై కీలక చర్చలు జరిగాయి.  అయితే.. తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ పెడతారని వార్తలు రాగానే ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. ఆంధ్ర పార్టీలకు ఇక్కడ స్థానం లేదని.. మళ్లీ ఆంధ్ర పాలకులు తమకెందుకని తెలంగాణ నాయకులు అంటున్నారు. అయితే.. తాజాగా తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌ షర్మిల పార్టీ వార్తలపై స్పందించారు. తెలంగాణ ప్రజలు.. ఆంధ్రా పార్టీలను స్వాగతించరని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కొత్త పార్టీలు తెలంగాణలో సక్సెస్‌ కాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు అసాధ్యమని అభిప్రాయపడ్డారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌. తెలంగాణ పార్టీలే ఇక్కడి రాజకీయాలకు పేటెంట్‌ అని స్పష్టం చేశారు.

Related posts