telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

షిరిడిలో కొనసాగుతున్న బంద్.. యథావిదిగా దర్శనాలు

shirdi shut down on political interfere

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యలకు నిరసనగా షిరిడిలో బంద్ కొనసాగుతోంది.మరోవైపు స్వామివారి దర్శనాలు యథావిదిగా సాగుతున్నాయి. షిరిడిలోని సాయిబాబా ఆలయాన్ని యథా ప్రకారం భక్తులు ఆదివారం నాడు దర్శించుకుంటున్నారు. షిరిడి గ్రామస్థులు, స్థానికులు ఆదివారం నుంచి నిరవధిక బంద్ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఆ ప్రభావం ఆలయంపై పడకుండా షిరిడి సాయి సంస్థాన్ ట్రస్ట్ చర్యలు తీసుకుంది.

పర్భాణీ జిల్లా పాథ్రీలోని సాయినాథుని జన్మస్థలంలో సౌకర్యాల కల్పనకు రూ.100 కోట్లు కేటాయించనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ప్రకటనతో వివాదం రగులుకున్న విషయం తెలిసిందే. పాథ్రీ సాయిబాబా జన్మస్థలమని ఆధారాలేవీ లేవని షిర్డీవాసులు వాదిస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనను నిరసిస్తూ ఆదివారం బంద్ కు పిలుపు ఇచ్చారు. దీంతో షిర్డీ చుట్టుపక్కల గ్రామాలతోపాటు షిర్డీలోనూ అంతా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు.

Related posts