telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

సొంత అక్కనే వేధింపులకు గురి చేస్తున్న తమ్ముడు…

మనిషి టెక్నాలజీ విషయంలో ఎంతలా అభివృద్ధి చెండుతున్నాడో ? అంతలా మానవ విలువల విషయంలో దిగజారి పోతున్నాడు. క్షణిక సుఖాల కోసం వావీ వరసలు కూడా మరిచిపోతున్నాడు. మరి సినిమాల ప్రభావమో లేక విచ్చలవిడిగా అంతర్జాలంలో దొరుకుతున్న బూతు సాహిత్యం ప్రభావమో తెలియదు కానీ దారుణమైన అంశాలకు పాల్పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌ లో ఒక తమ్ముడు తన అక్కనే లైంగిక వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో అక్కకి అసభ్య మెస్సేజ్‌లు తమ్ముడు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఎవరికీ చెప్పుకోలేక ఆ అక్క సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ను ఆశ్రయించినట్టు పోలీసులు వెల్లాడించారు. కొన్నాళ్లగా సోషల్ మీడియాలో తనకు వస్తున్న అసభ్య మెస్సేజ్‌ లపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు, విచారణ జరిపగా వరుసకు తమ్ముడయ్యే యువకుడే అసభ్య మెస్సేజ్‌లు పెడుతున్నట్లు గుర్తించారు. లైంగిక వాంఛలు తీర్చాలంటూ అక్కకే తమ్ముడు మెస్సేజ్‌ లు పెట్టినట్టు తెలియడంతో పోలీసులు షాక్ అయ్యారు. చివరికి అక్క పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తమ్ముడిని కటకటాల వెనక్కు నెట్టారు పోలీసులు. అయితే ఇప్పుడు ఈ వార్త హల చల్ గా మారింది.

Related posts