telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తెలంగాణ ప్రాజెక్టులపై వైసీపీ ఎమ్మెల్యే సీరియస్ కామెంట్స్‌

తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై వైసీపీ ఎమ్మెల్యే సీరియస్ కామెంట్స్‌ చేశారు. తెలంగాణ నీటి నిల్వల పైనా ఏపీ హక్కు కల్పించాల్సి ఉంటుందంటుని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి అన్నారు. తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులను సమీక్షించి.. రెగ్యులేట్‌ చేయాల్సిన అవసరం ఉందన్న ఆయన గోదావరి, కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్‌ ఆయకట్టుకు నీటి అవసరాలు తీర్చాకే గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులివ్వాలని అన్నారు.

అనుమతుల్లేకుండా తెలంగాణలో నీటిని ఆపితే.. ఆ నీళ్లపై ఏపీకి హక్కు కల్పించాలని అన్నారు. కృష్ణా జలాల అంశాన్ని వివాదంగా మార్చడం సరికాదన్న ఆయన కృష్ణా జలాలపై సుప్రీంలో వేసిన కేసును వెనక్కు తీసుకునేందుకు తెలంగాణ ఒప్పుకుందని అన్నారు. అపెక్స్‌ కౌన్సిల్లో మినిట్సే ముఖ్యం.. బయటకు వచ్చాక కేసీఆర్ ఏం మాట్లాడినా రాజకీయంగానే చూడాలని అన్నారు. తెలంగాణలో ప్రతిపక్షాల విమర్శల నుంచి తప్పించుకునేందుకు కేసీఆర్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టున్నారన్న ఆయన తెలంగాణలో ప్రతిపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు.

తెలంగాణలో ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించింది వైఎస్సారేనని, పెద్ద మనస్సుతో వైఎస్ నాడు తెలంగాణలో ప్రాజెక్టులు చేపట్టారని అక్కడి ప్రతిపక్షాలు గుర్తించాలని అన్నారు. రెండు రాష్ట్రాలు సహకరించుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ ప్రతిపక్షాలూ గుర్తించాలని ఆహ్య్న అన్నారు. కేసీఆర్‌-జగన్‌ లాలూచీ పడ్డారనే రీతిలో తెలంగాణ ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేస్తే దక్షిణ తెలంగాణకు నష్టమేనని అన్నారు.

కోటి ఎకరాలు సాగు చేసుకునే భూమి సీమలో ఉన్నా.. కేవలం ఆరేడు లక్ష ఎకరాలకు నీటిని అతి కష్టమ్మీద అందుతోందని, రాయలసీమ ప్రాజెక్టులను నింపిన పరిస్థితి ఎప్పుడూ లేదని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులకు తెలంగాణ అనుమతులు తీసుకోవాల్సి ఉందని ఆయన అన్నారు. గతంలో చంద్రబాబు బలహీనమైన సీఎంగా ఉండడం ఏపీకి నష్టం చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో చంద్రబాబుపై కేసులు ఉండడంతో తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తున్న ప్రశ్నించలేకపోయారన్న ఆయన సీలేరు నీటిపై చత్తీస్‌ఘడ్‌, ఒడిస్సా ప్రాజెక్టులు కడితే పోలవరానికి.. గోదావరి డెల్టాకు ఇబ్బందులేనని అన్నారు.

Related posts