telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు : వర్మ

Ram gopal Varma Fire Censor board

ఈరోజు చంద్రబాబునాయుడు తన 69వ పుట్టినరోజు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు వేడుకలు జరుపుకుంటుండగా, ఆయన అభిమానులు ఎంతో మంది శుభాభినందనలను తెలియజేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలిపారు. చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలంటూనే సెటైర్ వేశారు. “ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్ డే టూ చంద్రబాబునాయుడు. ఈ భూమిపై అత్యంత నీతి, నిజాయితీతో నివసిస్తున్న వ్యక్తి” అని తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఆపై మూడు నమస్కార ఎమోజీలను ఉంచారు. వర్మ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. వర్మ ట్వీట్ పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

Related posts